నేను నోరు విప్పితే కాపురాలు కూలిపోతాయ్‌..

306
Heroine Madhavi Latha Reveals Shocking Truth About TFI
- Advertisement -

మాధవీలత నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొంది.కన్నడ కుట్టి అయినా.. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్‌ను సొంతం చేసుకుంది. కానీ సినీ ఇండస్ట్రీని మాత్రం మెప్పించలేకపోయింది. ఆ కారణంగానే ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు. దీంతో మాధవీలత కోలీవుడ్‌కి మకాం మార్చేసింది. అక్కడా సక్సెస్ కాలేదు. కర్ణాటకలో పుట్టి పెరిగిన మాధవీలత మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ కలిగిన నటి అని గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంత టాలెంట్ ఉండి కూడా అయిదారు సినిమాలకే కనిపించకుండా పోయింది.

ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న మాధవి ఇప్పుడు హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు వెల్లడించింది.తాజాగా ఓ ఇంటర్వులో వెండితెరకు దూరమవడానికి కారణమేంటని అడిగితే.. మాధవీలత షాకింగ్ ఆన్సర్ చెప్పింది. ఒక టీవీ షోలో మాట్లాడిన మాధవీలత… ఇండస్ట్రీలో ఎవరికీ లొంగకపోవడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రొడ్యూసర్‌ అడిగిన దానికి ఆమె నో చెప్పినందుకు తనను ఎలా వేధించాడో వివరించింది. లొకేషన్‌లో అందరిముందు అరిచేవాడని, ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది.

Heroine Madhavi Latha Reveals Shocking Truth About TFI

మాధవి వెల్లడించిన విషయాలు నిజమే అయినా.. పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం బహిరంగంగా అంగీకరించలేని పరిస్థితి. తెలుగు సినీ ఇండస్ర్టీలో స్టార్‌ హీరోయిన్లు సైతం ఎదుర్కొనే విపత్కర పరిస్థితుల గురించి ధైర్యంగా వెల్లడించింది మాధవి. సినీ ఇండస్ర్టీలో హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురవుతారని, ముఖ్యంగా నిర్మాతలు ఇండైరెక్ట్‌గా అడుగుతెంటారని అంటోంది మాధవి. ‘నీకు లైఫ్‌ ఇస్తున్నాం కదా.. మరి, నువ్వు మాకేమిస్తావ్‌ అనే ధోరణిలో ఉంటాయి నిర్మాతల వ్యాఖ్యలు. చాలా స్మూత్‌గా నువ్వు సాయంత్రం ఖాళీయేనా అని అడుగుతారు. బయట ఎవరైనా ఇలా మాట్లాడితే చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. కానీ, ఇక్కడే బతకాలి కదా..! అందుకే చాలా మంది నోర్మూసుకుని ఆ వేధింపులను భరిస్తుంటారన’ని చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న చాలమంది.. హీరోయిన్స్ విషయంలో మాత్రం సెక్సువల్ రిలేషన్‌కే ప్రాధాన్యత ఇస్తారంది. నేను గనుక నోరు విప్పితే ఎంతమంది కాపురాలు కూలిపోయో అంటూ పరోక్షంగా హెచ్చరించింది. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పరిస్థితి ఇదేనని, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పుకొచ్చింది. ఇంకా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఎన్నో చేదు విషయాలు, వాటి వెనుక ఉన్న కఠిన వాస్తవాలను మాధవీలత ఆ ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్లు వివరించింది.

- Advertisement -