లైలా…13 ఏళ్ళ త‌ర్వాత రీఎంట్రీ..!

827
laila
- Advertisement -

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ లైలా.ఈ సినిమా హిట్ తర్వాత వచ్చిన ఉగాది, ఖైదీగారు, పెళ్లిచేసుకుందాం, పవిత్రప్రేమ, ఖైదిగారు లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లైలా దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బైలింగ్యువ‌ల్ మూవీతో రీఎంట్రీ ఉంటుంద‌ని..చిత్ర వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే వెల్లడించ‌నున్న‌ట్టు లైలా పేర్కొంది. తనకు తెలుగు,తమిళ ఇండస్ట్రీలు అంటే ఇష్టమని త్వరలో ఈ రెండు భాషల్లో కలిపి రీఎంట్రీ ఇస్తానని , దానికి తగ్గట్టుగా కథ చర్చలు నడుస్తున్నాయని లైలా చెప్పుకొచ్చింది.

మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో దాదాపు 50 సినిమాల వరకూ చేశానని తెలిపింది. తెలుగులో లైలా నటించిన చివరి చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి. 2006లో బిజినెస్ మెస్‌ మెహ‌దీన్‌ని వివాహం చేసుకొని సినిమాల‌కి దూర‌మైంది. టీవ‌ల పవిత్ర ప్రేమ కో స్టార్ బాల‌య్య‌తో పాటు సోనాల్ చౌహ‌న్‌తో క‌లిసి లైలా ఫోటోకి ఫోజులిచ్చింది. తెలుగులో వెంకటేష్,బాలకృష్ణ,మోహన్ బాబు,శ్రీకాంత్ లాంటి హీరోలతో నటించింది లైలా.

- Advertisement -