మెగా కాంపౌండ్ నుంచి మరో కటౌట్.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నవిషయం తెలిసిందే. ఆ కటౌట్ ఎవరో కాదు చిరు చిన్నల్లుడైన శ్రీజ భర్త కళ్యాణ్. వారాహి చలన చిత్రం బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి బయటపడింది.
ఈ సినిమాకి హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్లు టాక్. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కళ్యాణ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చిత్ర బృందం ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక కళ్యాణ్ హీరోగా పరిచయం అయ్యే ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
జనవరి నెలలో మంచి రోజు చూసి సినిమాను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలంటే పూర్తి కమర్షియల్ గా ఉంటాయి. అయితే కళ్యాణ్ లాంచ్ అయ్యే సినిమా మాత్రం అందుకు భిన్నంగా క్యూట్ లవ్ స్టోరీతో వస్తున్నట్టు తెలుస్తోంది.
చిరు చిన్నల్లుడికి హీరోయిన్ దొరికింది..
- Advertisement -
- Advertisement -