అతడితో ప్రేమలో ఉన్నా..ప్రభాస్ నా బెస్ట్ ఫ్రెండ్ః అనుష్క

607
anushka
- Advertisement -

స్టార్ హీరోయిన్ అనుష్క , యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు ప్రేమలో ఉన్నారని గత కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై తాజాగా స్పందించింది అనుష్క. నిశ్శబ్దం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన ప్రేమ, పెళ్లి గురించి ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతున్నారని అన్నారు.

తనకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని..చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంటుందని చెప్పింది. 2008లో తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని..అయితే కొన్ని పరిస్ధితుల కారణంగా తాము విడిపోయామని తెలిపింది. తాను ప్రేమించిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని తాను బయట చెప్పబోనని పేర్కొంది. కాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం మూవీ ఎప్రిల్ 2న విడుదల కానుంది. షాలిని పాండే, అంజలిలు ఈమూవీలో ముఖ్య పాత్రల్లో నటించారు.

- Advertisement -