అన్నీ తామై హిట్లు కొడుతున్న హీరోలు..

91
Tollywood Heros
- Advertisement -

సినిమా అనేది క్రియేటివ్ మీడియం. ఎంతో మంది ఆలోచించి,ఐడియాలు షేర్ చేసుకొని రాసుకుంటారు.టీమ్ వర్క్ కరెక్ట్ గా ఉంటేనే సినిమా పెద్ద హిట్టవుతుంది.పాతకాలంలో డైరెక్టర్ ల హవా ఎక్కువగా నడిచేది. ఆ టైమ్‌లో ఘోస్ట్ రైటర్ లకు డిమాండ్ ఉండేది.వాళ్ల పేరు వేయకుండా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి డైరెక్టర్ లు క్రెడిత్ తీసుకునే వారు.అలా చాలా మంది ఇండస్ట్రీలో పని చేశారు. కొంత కాలానికి రైటర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.పేరుతో పాటు పేమెంట్ కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుతం రైటర్లంతా డైరెక్టర్లు కావడంతో కొరత ఏర్పడింది. అందుకే కొత్తగా వస్తున్న యంగ్ హీరోలు రైటింగ్ మీద మంచి పట్టు సాధించుకొని వాళ్ల సినిమాలను వాళ్లే బాగా డిజైన్ చేసుకుంటున్నారు.

ఒకప్పుడు సినిమా హీరోలు కథలు రాసేవారు కాదు.. కేవలం దర్శకుడు చెప్పినట్టు యాక్ట్ చేసి పోయేవారు. కానీ ప్రస్తుతం అలా లేదు. హీరోలే కథలు రాసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కుదిరితే దర్శకత్వం కూడా వారే చేస్తున్నారు. ఇలా చేస్తున్న కొంత మంది టాలీవుడ్ హీరోలు హిట్లు కొడుతున్నారు. ఆ లిస్టులో అడివి శేష్,విశ్వక్సేన్,నవీన్ పోలిశెట్టి,సిద్దు జొన్నలగడ్డ,కిరణ్ అబ్బవరం లాంటి వాళ్లు తమ సినిమాలకు స్క్రీన్ ప్లే రాసుకుంటూ సక్సెస్ అవుతున్నారు.

-అడివి శేష్: క్షణం (కథ, స్క్రీన్ ప్లే), గూడఛారి (కథ, స్క్రీన్ ప్లే), ఎవరు (స్క్రీన్ ప్లే)
-నవీన్ పొలిశెట్టి: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (కథ, స్క్రీన్ ప్లే)
-కిరణ్ అబ్బవరం: SR కళ్యాణమండపం (కథ, స్క్రీన్ ప్లే, మాటలు)
-సిద్ధు జొన్నలగడ్డ: కృష్ణ అండ్ హిస్ లీల (కథ, స్క్రీన్ ప్లే)
-విశ్వక్ సేన్: ఫలక్ నుమా దాస్ (స్క్రీన్ ప్లే, దర్శకుడు)

హీరో అడివి శేష్: అడివి శేష్ తెలుగు వాడైనా అమెరికా లో పెరిగాడు.సినిమాలంటే బాగా ఆసక్తి.అక్కడే సినిమా గురించి నేర్చుకొని మెల్లగా సినిమాలు తీయడం మొదలు పెట్టాడు.2010లో ‘‘కర్మ’’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. యాక్టర్ గానే కాకుండా డైరెక్షన్ కూడా చేసాడు ఈ సినిమాకు. రిజల్ట్ పక్కనపెడితే విమర్శకుల ప్రశంసలు పొందిందీ చిత్రం. ఆ తర్వాత వేరే సినిమాల్లో నటిస్తూనే తన డైరెక్షన్ లో నే ‘‘కిస్’’ అనే సినిమా తీసాడు.ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు.అయినా తన రైటింగ్ ను వదల్లేదు. 2016 ‘‘క్షణం’’ అనే సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు.కానీ ఈ సారి కేవలం స్టోరీ ,స్క్రీన్ ప్లే మాత్రమే ఇచ్చాడు.డైరెక్టర్ గా రవికాంత్ పేరేపు పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెంటనే ఎవరు చేశాడు. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే ఇవ్వడం వల్ల పెద్ద హిట్టయింది.గూడాచారి సినిమాకు కథ ,స్క్రీన్ ప్లే అందించాడు. బ్లాక్ బస్టర్ అయింది.లేటెస్ట్ గా ‘మేజర్ ’’ సినిమా తో మరో హిట్ కొట్టాడు. దీనికి కూడా కథ,స్క్రీన్ ప్లే అడివిశేషే అందించడం విశేషం. నటనతోనే కాదు.ఎక్స్ ట్రా ఎఫర్ట్స్ పెట్టి రైటింగ్ లో కూడా ఇన్ వాల్వ్ అయి జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలో ‘‘గూడాచారి 2’’ తో పాటు, మరి కొన్ని సినిమాల్లో కూడా రైటింగ్ ,డైరెక్షన్ లో తన కాంట్రిబ్యూషన్ ఉంటుందంటున్నాడు శేష్.

హీరో విశ్వక్ సేన్: విశ్వక్ సేన్ కు తొందరగా ఫేమ్ వచ్చేసింది. ‘‘వెళ్లి పోమాకే’’ అనే ఓ సింపుల్ సినిమా తీసి లైమ్ లైట్ లోకి వచ్చేసాడు.ఆ తర్వాత తరుణ్ భాస్కర్ తో‘‘ ఈ నగరానికి ఏమైంది’’ అనే మూవీ తో హీరోగా మారాడు.కానీ తనకు ముందు నుండి రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటే బాగా ఇష్టం ఉండేదట.అందుకే ఫస్ట్ టైమ్ ‘‘ఫలక్ నుమా దాస్’’ మూవీతో డైరెక్టర్ గా మారాడు. పక్కా హైదరాబాదీ అయిన విశ్వక్ ఆ మూవీలో హైదరాబాద్ కల్చర్ ను బాగా ప్రజెంట్ చేశాడు. సినిమా అంతంత మాత్రంగానే ఉన్నా.. తనకు క్రేజ్ తెచ్చిపెట్టిందీ మూవీ. ఆ తర్వాత హిట్, పాగల్,అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలు చేసాడు.అందులో రైటర్ గా పేరు వేసుకోకపోయినా.. రైటింగ్ లో తను ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రస్తుతం డైరెక్టర్ గా ‘‘దాస్ కా ధమ్కీ’’ అనే మూవీ చేస్తున్నాడు. ముందునుండి తనకు స్క్రిప్టు రైటింగ్,డైరెక్షన్ అంటే ఇష్టమనీ ,త్వరలోనే ‘‘ఫలక్ నుమా దాస్ 2’’ అనే సినిమా తీస్తానని చెప్తున్నాడు.

హీరో నవీన్ పొలిశెట్టి: నవీన్ టాలెంటెడ్ పర్సన్.నటనలోనే కాదు, రైటింగ్, ప్రమోషన్ లలో తను నేర్పరి.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నవీన్ సినిమాల్లోకి రావడానికి కష్టపడ్డాడు.అవకాశాల కోసం ముంబై లో తిరిగిన నవీన్ స్టాండప్ కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టాడు. దాంతో పాటు థియేటర్స్ కూడా చేశాడు. అక్కడే స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి అవగాహన పెంచుకున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ,నేనొక్కడినే లాంటి సినిమాల్లో రోల్స్ చేసినా ‘‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’’ తో మంచి హిట్ కొట్టాడు. నవీన్ ఆ సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు.అంతేకాదు కొన్ని డైలాగులు కూడా ఆయనే రాసాడు.ఆ సినిమా సక్సెస్ లో మెయిన్ రోల్ ప్లే చేశాడు.అంతేకాదు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన ‘‘జాతి రత్నాలు’’ లో కూడా నవీన్ పొలిశెట్టి హస్తం ఉంది. కొన్ని డైలాగులు ,మేనరిజంస్ తో సినిమాను నిలబెట్టాడు.రాబోయే చిత్రాల్లో కూడా రైటింగ్,డైరెక్షన్ లో తన పాత్ర బలంగా ఉండబోతుంది.

హీరో సిద్దూ జొన్నలగడ్డ: సిద్దూ 10 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ మొన్నటివరకు సరైన బ్రేక్ రాలేదు.డిజె టిల్లుతో స్టార్ అయ్యాడు.అయితే సిద్దుకు ముందు నుండి రైటింగ్ అంటే ఇష్టం. తన అన్ని సినిమాలకు రైటింగ్ డిపార్ట్ మెంట్‌లో పనిచేశాడు. జోష్,ఆరెంజ్ సినిమాల్లో చిన్న రోల్స్ చేసినా సిద్దూ ఎల్.బి.డబ్ల్యూ,గుంటూర్ టాకీస్ లాంటి సినిమాలు చేసినా పెద్దగ బ్రేక్ రాలేదు. క్రిష్ణా అండ్ హిస్ లీలా ఓటీటీలో రిలీజ్ కావడంతో బాగా పేరొచ్చింది. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు. రీసెంట్ గా ‘‘డిజె టిల్లు’’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. డిజె టిల్లు సినిమాకు సిద్దూ యే రైటర్. అంతా తనే రాసుకున్నాడు. డైరెక్షన్‌లో కూడా ఇన్ వాల్వ్ మెంట్ ఉందంటున్నారు. తన మేనరిజమ్స్ ,డైలాగులు అన్నీ పర్ఫెక్ట్ గా రాసుకొని హిట్ కొట్టాడు.త్వరలో రాబోతున్న డిజె టిల్లు కూడా తనే రాసుకుంటున్నాడు. ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే చాన్సు కూడా ఉంది.

హీరో కిరణ్ అబ్బవరం: కిరణ్ అబ్బవరం ఈ మధ్యే లైమ్ లైట్ లోకి వచ్చాడు.రాజావారు రాణివారు మూవీతో విమర్శకుల ప్రశంసలు పొందాడు.ఆ సినిమాకు పేరు వేసుకోకున్నా స్క్రిప్టు పరంగా ఇన్వాల్వ్ చేశాడు. ఆ తర్వాత ‘‘ఎస్.ఆర్ కళ్యాణ మండపం’’ మూవీకి స్క్రీన్ ప్లే,డైలాగులు రాసాడు. ఆ మూవీ హిట్ అయింది.ఆయనకు మంచి బ్రేక్ దొరకింది. ప్రస్తుతం కొత్త డైరెక్టర్లతో మూడు సినిమాలు చేస్తున్నాడు.అందులో కూడా కిరణ్ రైటింగ్ లో సాయం చేస్తున్నాడు. తన సినిమాలన్నిటికీ తానే దగ్గరుండి స్క్రిప్టు చేయించుకుంటున్నాడు.కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

వీళ్లే కాదు.. ప్రస్తుతం వస్తున్న యంగ్ హీరోలంతా వాళ్ల సినిమాల పట్ల జాగ్రత్త వహిస్తున్నారు. కేజీఎఫ్ సెన్సేషన్ యశ్ కూడా అంతే.తన సినిమాకు మాటలు రాసుకుంటాడు. కేజీఎఫ్‌కు కూడా చాలా డైలాగులు తానే రాసాడు అని స్వయంగా డైరెక్టర్ ప్రశాంత్ నీలే ప్రకటించాడు.తెలుగులో నాని,విజయ్ దేవరకొండ లకు కూడా స్క్రిప్టుల పట్ల మంచి అవగాహన ఉంది. వీళ్లు ఇలా ఇన్ వాల్వ్ అయితే డైరెక్టర్లతో కాస్త విభేధాలు వచ్చే చాన్సుంది.కానీ సరైన అండర్ స్టాండింగ్ ఉంటే అలాంటి గొడవలకు తావు లేదు అంటున్నారు అంటున్నారు కొంతమంది హీరోలు.

- Advertisement -