కేజీఎఫ్‌ ౩….యశ్ క్లారిటీ!

234
yash hero
- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్‌. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సెకండ్ పార్టు చివరలో సస్పెన్స్‌ను కొనసాగిస్తూ పార్టు 3 ఉంటుందనే సంకేతాలిచ్చారు దర్శకుడు నీల్.

ఇక ఈ వార్తలకు బలం చేకూరేలా నిర్మాత విజయ్ సైతం 3వ పార్టు ఉంటుందని చెప్పారు. అయితే తాజాగా కేజీఎఫ్‌ 3పై స్పందించారు యశ్‌. కేజీఎఫ్‌ చాప్టర్‌ ౩ రాబోతుందనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే నిర్మాత మాత్రం త్వరలోనే షూటింగ్ ఉంటుందని చెప్పడంతో ఎవరి మాటలు నమ్మాలో తెలియక అంతా గందరగోళంలో పడ్డారు.

కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ 2 రెండు పార్టులు కలిపి బాక్సాఫీస్‌ని షేక్ చేయడమే కాదు దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -