పళనిస్వామికి థాంక్స్ చెప్పిన విజయ్..

163
Hero Vijay meeting with Palaniswamy,,
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని స్టార్‌ హీరో విజయ్‌ కలిశారు. ఆదివారం చెన్నైలోని పళనిస్వామి ఇంటికి వెళ్లి, ఆయనతో మాట్లాడిన విజయ్‌, స్థానిక వినోదపు పన్నును 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించినందుకు విజయ్‌ సీఎంకు ధన్యవాదాలు చెప్పినట్లు తెలుస్తోంది.

తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్ పీసీ), సినీ సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 Hero Vijay meeting with Palaniswamy,,

కాగా, స్థానిక వినోదపు పన్ను తగ్గించకపోతే ఈ నెల 6వ తేదీ నుంచి కొత్త సినిమాలను విడుదల చేయమని టీఎఫ్ పీసీ హెచ్చరించడంతో తమిళ ప్రభుత్వం దిగొచ్చింది. దీంతో, ఈ నెల 18న విడుదల కావలసిన విజయ్ త్రిపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం ‘మెర్సల్’ విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రం తెలుగులో ‘అదిరింది’ పేరిట రిలీజవుతోంది.

- Advertisement -