శునకాలతో పోల్చి..క్షమాపణలు చెప్పిన సల్మాన్‌

248
Salman Khan Says Sorry To His Dogs For Calling Him One..
- Advertisement -

ఓ కంటెస్టెంట్ పై బాలీవుడ్ సుల్తాన్‌ సల్మాన్ ఖాన్ మండిప‌డ్డాడు. సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ 11వ సీజన్ కు బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో నేపథ్యంలో ఓ కంటెస్టెంట్ ను తిట్టిన సల్మాన్, అతన్ని శునకాలతో పోల్చాడు. ఆ తర్వాత క్షమాపణలూ చెప్పాడు.

 Salman Khan Says Sorry To His Dogs For Calling Him One..

అయితే, క్షమాపణలు చెప్పింది సదరు కంటెస్టెంట్ కు కాదు, శునకాలకు. ఎందుకంటే శునకాలతో అతన్ని పోల్చి వాటి విలువను తగ్గించినందుకు క్షమాపణలు చెప్పానంటూ సల్మాన్ చమత్కరించాడు. కాగా, గతంలో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ జుబైర్ ఖాన్ ను సల్మాన్ పంపివేశాడు. ఈ విషయమై కోర్టుకు ఎక్కుతానని, సల్మాన్ పై కేసు పెడతానని జుబైర్ ఖాన్ హల్ చల్ చేశాడు.

- Advertisement -