ఐటీ రైడ్స్ తర్వాత మాస్టర్స్ సినిమా షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు హీరో విజయ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నైవెలీలో జరుగుతుండగా లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు.
ఐటీ రైడ్స్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ రాగా శుక్రవారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుండగా ఈ మూవీ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు విజయ్.
ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడు సినీ ఇండస్ట్రీలో కలకలం చోటుచేసుకుంది. హీరో విజయ్ వర్సెస్ బీజేపీగా మారగా విజయ్‌కి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తు తమ అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.
కోట్లాది రూపాయల మేర పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై తమిళ హీరో విజయ్, ఏజీఎస్ నిర్మాణ సంస్థ అధినేత, సినీ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుసెళియన్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు బుధవారం చేసిన సోదాలు గురువారం కొనసాగాయి.