తనపై వస్తున్న పుకార్లను నమ్మవద్దు: తరుణ్‌

311
tarun
- Advertisement -

త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభమవుతుందని స్టార్ మా అఫిషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బిగ్ హౌస్‌లోకి వెళ్లేది ఎవరనేదానిపై పుకార్లు షికార్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హీరో తరుణ్ బిగ్ బాస్ 4వ సీజన్‌లో పాల్గొంటారని ప్రచారం జరుగుతుండగా వాటిని ఆయన ఖండించారు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో,కొన్ని పత్రికల్లో తాను బిగ్ బాస్‌లో పాల్గొంటానని వార్తలు వస్తున్నాయి…అవి పూర్తిగా అవాస్తవం అని తెలిపారు.

బిగ్ బాస్‌లో పాల్గొనే ఆలోచన కానీ, ఉద్దేశం కాని తనకు లేదని ఎప్పటికీ కలగదని స్పష్టం చేశారు తరుణ్‌.తనపై వస్తున్న వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని తప్పుడు వార్తలను దయచేసి ప్రచారం చేయవద్దని కోరారు తరుణ్.

- Advertisement -