గ్రీన్ ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం: సూర్య

142
suriya
- Advertisement -

ఈటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన నటుడు సూర్యను మర్యాదపూర్వకంగా కలిసి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ

ప్రముఖ నటుడు సూర్య తన నూతన చిత్రం ఈటీ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో హైటెక్ సిటీ వెస్ట్ ఇన్ హైదరాబాద్ హోటల్ లో మర్యాద పూర్వకంగా కలిసి వృక్షావేదం పుస్తకాన్ని సూర్యకు బహుకరించారు గ్రీన్ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్,వృక్షాల గొప్పతనం తెలియజేసేలా రూపొందించిన వృక్షవేదం పుస్తక విశేషాలను సూర్యకు వివరించారు రాఘవ. గ్రీన్ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడిన సూర్య ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.వృక్షాల గొప్పతనం తెలియజేసెల రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని అందుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -