సుమంత్ హీరోగా షూటింగ్ పునఃప్రారంభం..

41
sumanth

సుమంత్ హీరోగా ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై శ‌ర్మ చుక్కా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి గుజ్జు రాము స‌మ‌ర్ప‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. లాక్‌డౌన్‌కి ముందు ఈ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ నిర్వ‌హించారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ జ‌రుగుతోంది. హీరో సుమంత్‌, ఇత‌ర తారాగ‌ణంపై ద‌ర్శ‌కుడు కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

ఆద్యంతం ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో, వినోదాత్మ‌క స‌న్నివేశాల‌తో సినిమా న‌డుస్తుంద‌ని చిత్ర బృందం తెలియ‌జేసింది. త్వ‌ర‌లోనే టైటిల్ అనౌన్స్ చేయ‌నున్నారు. సుమంత్ స‌ర‌స‌న నాయిక‌గా ఐమా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌ధునంద‌న్‌, ధ‌న్‌రాజ్‌, హైప‌ర్ ఆది చ‌క్క‌ని హాస్యాన్ని పండించ‌నున్నారు. మార్క్ కె. రాబిన్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు సిద్ధం మ‌నోహ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:సుమంత్‌, ఐమా, ప్ర‌భ‌, మ‌ధునంద‌న్‌, ధ‌న్‌రాజ్‌, హైప‌ర్ ఆది, క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: ముర‌ళీకృష్ణ‌
ప్రొడ్యూస‌ర్‌: శ‌ర్మ చుక్కా
స‌మ‌ర్ప‌ణ‌: గుజ్జు రాము
బ్యాన‌ర్‌: ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: మాదాల ఝాన్సీకృష్ణ‌, ర‌మేష్ మ‌హేంద్ర‌వాడ‌
మ్యూజిక్‌: మార్క్ కె. రాబిన్‌
సినిమాటోగ్ర‌ఫీ: సిద్దం మ‌నోహ‌ర్‌