సుధీర్ బాబు , అదితి రావ్ జంటగా నటించిన సినిమా సమ్మోహనం. రేపు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈసినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ ఎంటటైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు సుధీర్ బాబు. ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు సమ్మోహనం టీం. సుధీర్ బాబు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మంచి హిట్ మూవీ తన నుంచి చేజారిపోయిందని చెప్పాడు. నా మొదటి సినిమా ‘ఎస్సెమ్మెస్ విడుదలకు వారం ముందుగా నేను వేరో సినిమాకు సైన్ చేశాను అని చెప్పాడు. ఆ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాల్సి ఉందన్నారు. నా కేరీర్ మొదట్లోనే డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటితో సినిమా చేసే అవకాశం కొల్పోయాన్నారు. ఆసినిమాకు స్టోరీని అవసరాల శ్రీనివాస్ అందించారన్నారు.
కొన్ని కొరణాల వల్ల ఆ సినిమా తన నుంచి చేజారిపోయిందన్నారు. ఆ తర్వాత ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేసి అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా సినిమాను తీశాడని చెప్పారు. నాగశౌర్య, రాశిఖన్నా జంటగా నటించినటువంటి ఉహలు గుసగుసలాడే సినిమా అని చెప్పాడు. దర్శకుడిగా శ్రీనివాస్ అవసరాలకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అన్నారు. అంతేకాకుండా టాలీవుడ్ మంచి సక్సెస్ కూడా సాధించిందన్నారు. అలా నా చేతి లోంచి ఓ హిట్ సినిమా పోవడం చాల బాధనిపించిందని తెలిపారు సుధీర్ బాబు.