‘స‌మ్మోహ‌నం’ నా కెరీర్ లో బెస్ట్ మూవీః సుధీర్ బాబు

293
Sudheer Babu
- Advertisement -

సుధీర్ బాబు, అదితీరావు జంట‌గా న‌టించిన‌టువంటి సినిమా ‘సమ్మోహనం’ . ఈచిత్రానికి ఇంద్ర‌గంటి మోహనకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రొమాంటిక్ ఎంటటైన‌ర్ గా సినిమా తెర‌కెక్కింది. ఇటివ‌లే స‌మ్మెహ‌నం ఆడియో లాంచ్ ను కూడా పూర్తి చేసుకుంది. గోపిసుంద‌ర్ అందించిన సంగీతానికి ప్రేక్ష‌కుల్లో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ ఆడియో లాంచ్ కార్యక్రామానికి సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఇక ఈసినిమా ఈనెల 15వ తేదిన ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.Sammohanam

ఈసంద‌ర్భంగా ఈసినిమాకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు హీరో సుధీర్ బాబు. డైరెక్ట‌ర్ మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటితో చాలా రోజుల క్రీత‌మే సినిమా చేయాల్సి ఉంద‌ని కానీ..కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేద‌న్నారు. స‌మ్మోహ‌నం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఇంత మంచి క‌థ‌తో నాతో సినిమా తీస్తున్న ఇంద్ర‌గంటికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. స‌మ్మోహ‌నం సినిమాతో మా కాంబినేషన్ సెట్ కావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

sammohanam

ఈమూవీలో నేను విజ‌య్ పాత్ర‌లో క‌నిపిస్త్తాన‌ని తెలిపారు. ఇంత‌వ‌ర‌కూ నేను చేయ‌ని పాత్ర‌లో ఇప్ప‌డు క‌నిపించ‌బోతున్నాన‌ని తెలిపారు. ఈసినిమా నా కెరిర్లో చెప్పుకోద‌గిన‌దిగా నిలిచిపోతుంద‌న్నారు. ఈచిత్రాన్ని డైరెక్ట‌ర్ చాల అందంగా తెర‌కెక్కించార‌న్నారు. డైరెక్ట‌ర్ హరీశ్ శంక‌ర్, త‌రుణ్ భాస్క‌ర్, అవ‌స‌రాల శ్రీనివాస్ లు ఈమూవీలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తార‌న్నారు. ఈమూవీ త‌ప్ప‌కుండా ఘ‌న విజ‌యం సాధిస్తోంద‌ని నాకు న‌మ్మ‌కం ఉంద‌న్నారు హీరో సుధీర్ బాబు.

- Advertisement -