కేటీఆర్ చేసిన ప‌నికి ఉత్త‌మ్ ఫిదా..

251
utttam, ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన ట్వీట్ కు స్పందించారు మంత్రి కేటీఆర్. దాంతో పాటు బాధిత కుటంబానికి న్యాయం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కు ఆదేశాలు జారీ చేశారు. త‌న దృష్టికి వ‌చ్చిన ఏ స‌మ‌స్య‌నైనా కొద్ది క్ష‌ణాల్లోనే ప‌రిష్కారం చూపుతాడు మంత్రి కేటీఆర్. సోష‌ల్ మీడియా వేదికగా ఎవ‌రూ ప్ర‌శ్నించినా దానికి స‌రైన స‌మాధానం ఇస్తాడు. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ప‌నికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫిదా అయిపోయారు.

కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో ఓ వృద్ద జంట గ‌త కొద్ది రోజులుగా ఉరి బ‌యట ఓ గుడిసెలో జీవ‌నం సాగిస్తున్నారు. అయితే గ్రామపంచాయితి అధికారులు వారికి కూడా ఇంటి ప‌న్ను కింద రూ.500 క‌ట్టాల‌ని బిల్లు పంపించారు. ఆ వృద్దులు భ‌య‌ప‌డి రూ.500 క‌ట్టారు. దింతో ఈ స‌మ‌స్యపై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్పందించి తెలంగాణ సీఎంవో తో పాటు మంత్రి కేటీఆర్ దృష్టికి తిసుకెళ్లారు. వెంట‌నే ఆ డ‌బ్బు వారికి తిరిగి ఇవ్వాల‌ని అలాగే వెంట‌నే డ‌బుల్ బెడ్ రూం ఇల్లు కూడా మంజూరు చేయాలిని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన ట్వీట్ పై స్పందించారు మంత్రి కేటీఆర్. స‌మ‌స్య‌ను త‌మ వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నామ‌ని ట్వీట్ చేశారు. వెంట‌నే మంత్రి కేటీఆర్ స్ధానిక పంచాయితీ సెక్రెట‌రీకి ఈ విష‌యం తెలిపి..త‌ప్పును స‌రిదిద్దుకునేలా చేయాల‌ని అసిఫాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆ వృద్ద జంట‌కు ఆస‌రా పెన్ష‌న్ అందుతుందో లేదో తెలుసుకుని వారికి న్యాయం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు మంత్రి కేటీఆర్. ఇద్ద‌రి నాయ‌కుల పార్టీలు వెరైనా ఓ వృద్ద జంట‌కు న్యాయం జ‌రగ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు. మంత్రి కేటీఆర్, ఉత్త‌మ్ ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోన్నారు.

- Advertisement -