- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా వినాయక చవితి సందర్భంగా విత్తన గణపతి పంపిణీ కార్యక్రమం లో బాగంగా మాదాపూర్ లోని తన ఆఫీస్ లో సినీ నటుడు శ్రీవిష్ణు కి విత్తన గణపతి పంపిణీ చేసిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు.
ఈ వినాయక చవితికి అందరం విత్తన గణపతిని పూజిద్దాం అని పిలుపునిచ్చారు శ్రీవిష్ణు.విత్తన గణపతి పంపిణీ కార్యక్రమం తలపెట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి ఇంట్లో వేప చెట్టు ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆశయం కూడా సిద్ధిస్తుంది..ఇది చాలా మంచి కాన్సెప్ట్..
ప్రతి ఇంట్లో వేప చెట్టు ఉండడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలి… ప్రతిఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు.
- Advertisement -