తెలంగాణ వెదర్ అప్‌డేట్..

192
weather report
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ.ఈశాన్య మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 2.1 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.తూర్పు-పశ్చిమ shear zone 21.0 deg. Lat. వెంబడి 3.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఏర్పడింది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నది.

వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 13 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

- Advertisement -