కాంగ్రెస్‌లో చేరిన సోనూ సోదరి..

51
sonu

పంజాబ్ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రియల్ హీరో సోనూ సోదరి హస్తం గూటికి చేరారు. ఈ మేరకు సోనూ నివాసానికి స్వయంగా వెళ్లిన పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ…వారితో చర్చించి హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మోగా నుండి ఆమె బరిలో దిగనున్నారు.

పంజాబ్ ఎన్నికల వేళ.. ఈ డెవలప్ మెంట్ ని గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని మాల్వికా సూద్ చెప్పారు. పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, సిద్ధూల సమక్షంలో మాల్వికా సూద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు. పంజాబ్ ఎన్నికల్లో తన సోదరికి తన మద్దతు ఉంటుందని సోనూసూద్ ఇదివరకే ప్రకటించారు.