రాహుల్‌ ఎంతోమందికి స్పూర్తిదాయకం:సిద్దార్థ్

271
Siddharth
- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్,ది వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు,నెటిజన్లు రాహుల్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా హీరో సిద్దార్థ్…ది వాల్ రాహుల్‌పై ప్రశంసలు గుప్పించారు. ఓ క్రికెటర్‌గా మీ నైపుణ్యం,మానవత్వంతో మాలాంటి చాలామంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని తెలిపారు.

తమలాంటి చాలా మందికి రాహుల్‌ స్ఫూర్తిదాయకమని నా హీరో రాహుల్‌ ద్రవిడ్ అని కొనియాడారు. మీరు క్రికెట్ ప్రపంచంలోకి రాకముందు నుంచే మిమ్మల్ని ఫాలో అవుతున్నానని…రిటైర్మెంట్ తర్వాత కూడా మీ నుంచి ప్రేరణ పొందుతున్నానని ట్వీట్ చేశారు సిద్దార్థ్.

https://twitter.com/Actor_Siddharth/status/1014047471553527808

రాహుల్‌ ద్రవిడ్ కంటే ముందు బిషన్‌సింగ్‌ బేడీ, సునీల్‌ గావస్కర్‌, కపిల్‌దేవ్‌, అనిల్‌ కుంబ్లే హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించారు. ద్రవిడ్‌తో పాటు ఈ ఏడాది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వారిలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్,ఇంగ్లాండ్ మాజీ క్రీడాకారిణి కేర్లీ టేలర్‌ కూడా ఉన్నారు.

ప్రస్తుతం భారత అండర్‌-19, భారత-ఎ జట్లకు ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు. 1996లో అంతర్జాయతీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రాహుల్‌ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడే ఒంటరిపోరాటం చేసి ది వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ద్రవిడ్ కోచ్‌గా భారత్ అండర్‌-19 జట్టు ఒక్కమ్యాచ్ ఓడిపోకుండా వాల్డ్ కప్‌ను గెలుచుకుంది.

- Advertisement -