మహాసముద్రం కోసం రేటు పెంచిన సిద్ధార్థ్..!

193
sidharth
- Advertisement -

లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు హీరో సిద్ధార్థ్. 100 డైరెక్టర్‌ అజయ్‌ భూపతి మల్టీస్టారర్‌ మూవీగా వస్తున్న ‘మహాసముద్రం’ చిత్రంలో సిద్దార్థ్‌ శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, ఆదితి రావు హైదరిలు కథానాయికలుగా నట్తిసుండగా ఈ సినిమా కోసం రెమ్యునరేషన్‌ని భారీగా పెంచేశారట సిద్ధార్థ్.

దాదాపు 3 కోట్ల రూపాయల పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కుర్ర హీరోలలో ఎవరికి ఇంతటి పారితోషికం లేదని, తొమ్మిదేళ్ల తర్వాత కూడా సిద్దార్థ్‌ ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడంతో కొంత మంది షాక్ అవుతున్నారు.

‘బాయ్స్‌’ మూవీతో హీరోగా పరిచయమైన సిద్దార్థ్‌.. ‘నువ్వోస్తానంటే నెనోద్దంటానా’ తెలుగు ఫస్ట్ స్ట్రైట్ మూవీతో టాలీవుడ్ లో స్టార్‌ హీరోగా మారాడు. ‘బొమ్మరిల్లు’ అల్టిమేట్ హిట్ తో తిరుగులేని లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు సిద్ధార్థ్.

- Advertisement -