గతేడాది నాగ శౌర్య పెళ్లి కొడుకుగా మారి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో మరో యంగ్ హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవుతున్నాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడు.
అన్ స్టాపబుల్ షోలో నీ పెళ్లెప్పుడని బాలయ్య అడిగితే ప్రభాస్ కి అయ్యాక అంటూ సమాదానం ఇచ్చాడు శర్వా. ఇప్పుడు ప్రభాస్ కంటే ముందే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్న ఓ అమ్మాయితో కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్న శర్వా త్వరలోనే ఆమెను పెళ్లాడబోతున్నాడని తెలుస్తుంది.
తన ప్రేమ , ప్రేయసి గురించి ఇటీవల ఇంట్లో వారికి తెలియజేసి ఆమెతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడట శర్వా. ఈ ఏడాదిలో శర్వానంద్ పెళ్లి గ్రాండ్ గా జరగనుందని అంటున్నారు. త్వరలోనే శర్వా తనకి కాబోయే భార్యను తన ఫ్యాన్స్ కి పరిచయం చేసి సోషల్ మీడియా ద్వారా విషయం చెప్పే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..