హీరో రామ్,పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం హిట్ కావడంతో మొదటి రోజు థియేటర్ల ఆక్యుపెన్సీ బాగుందని ఇప్పటికే రిపోర్టులు వచ్చాయి. దాంతో ఈ చిత్రం హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ. 16 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి రామ్ ట్వీట్ చేశాడు. ‘డియర్ పూరి జగన్నాథ్ గారు, సినిమా నచ్చితే పొగుడుతాం. నచ్చకపోతే బూతులు తిడతాం. కానీ మిమ్మల్ని మాత్రం బూతులతో పొగడబుద్ధి అవుతోందేంటండీ? నాపై మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ ప్రేమ స్క్రీన్ పై కనపడింది’ అని ట్వీట్ చేశాడు.
Dear @purijagan garu..
Cinema nachithe pogudutham..
Nachakapothe boothulu thidatham..
Kaani, mimmalni maatram entandi “Boothulatho Pogadabhudhavuthundhi.. “Thank you for all the love you’ve showered upon me..it truly reflected on screen! #love
-R.A.P.O #iSmartShankar pic.twitter.com/rYkeNfQqTR— RAm POthineni (@ramsayz) July 19, 2019