టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను రాపో19గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ కోసం హీరో రామ్ పాత్రకు తగ్గట్లుగా తన శరీర ఆకృతిని మార్చుకుంటున్నాడు. ఇందుకు రామ్ జిమ్‌లో బాగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో వ్యాయామం చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది.
ఈ విషయాన్ని రామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా మెడకు గాయమైందని చెబుతూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. మెడకు గాయం కావడంతో పట్టీ వేసుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. తలను కూడా ఆయన సరిగ్గా కదిలించలేకపోతున్నట్లు ఫోటో చూస్తే తెలుస్తోంది. అయితే ఈ పోస్ట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. విషయం తెలిసి.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక రామ్‌కు గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది.