మంత్రి కేటీఆర్‌ని కలిసిన హీరో రామ్…

62
ktr

మంత్రి కేటీఆర్‌ని కలిశారు హీరో రామ్‌. భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్‌ వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయం అందించారు. మంత్రి కేటీఆర్‌ని కలిసి రూ. 25 ల‌క్ష‌ల చెక్ అందించారు రామ్‌.

నా తెలంగాణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి గురించి ఆందోళ‌న చెందుతున్నా. వ‌ర‌ద‌లు వ‌చ్చిన మొద‌టి రోజు నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించడం సంతోషకర విష‌యం. వ‌ర‌ద బాధితుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న సేవ‌లు ప్ర‌శంసనీయం అన్నారు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి నా వంతుగా రూ.25 ల‌క్ష‌లు విరాళంగా అంద‌జేస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.