ప్రముఖ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు గత నెల 13న ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ కు ఎటువంటి ప్రమాదం కాలేదు. ప్రమాద స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటూ పోలీసులు రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని టోలీచౌకీ ఆర్టీఏ అధికారులకు శంషాబాద్ పోలీసులు లేఖ రాశారు.
దీంతో వారు ఈ ఏడాది నవంబరు 29 నుంచి వచ్చే ఏడాది మే 20 వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజశేఖర్ కారుపై ఉన్న చలాన్లలో ఎక్కువగా స్పీడ్ డ్రైవింగ్ వే ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీంతో ఎడాడి పాటు అతని లైసెన్స్ చేసినట్లు తెలిపారు. 2017 అక్టోబర్‌లోనూ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారును రాజశేఖర్ వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. పోలీసుల సమాచారం ప్రకారం రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి 2017 లోనే ముగిసింది అని తెలుస్తుంది.