కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తో హీరో ప్రభాస్

548
Prabhas
- Advertisement -

x

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనకు గురిచేస్తుంది. చైనాలో కొంత వరకు తగ్గుముఖం ఇతర దేశాలపై కరోగా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు కరోనా వల్ల 3వేల మంది మరణించగా 80వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. 65 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించి…ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మన దేశంలో కూడా కోరని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులను ధరించి కనిపిస్తున్నారు.

కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించి ప్రయాణం చేస్తున్నాడు హీరో ప్రభాస్. ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న సమయంలో ఆయన మాస్క్ ధరించాడు. ప్రభాస్ మాస్క్ ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా కరోనాపై అవగాహన కల్పించారు. తమవంతుగా వీడియోలు పోస్ట్ చేశారు. కరోనా రాకుండా పలు జాగ్రత్తలో తీసుకోవాలంటూ సూచిస్తున్నారు.

- Advertisement -