బాలీవుడ్ మూవీ రీమేక్ లో నితిన్

583
nithin
- Advertisement -

బాలీవుడ్ నుంచి తెలుగులోకి చాలా సినిమాలు రిమేక్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ సినిమాలు తెలుగులో భారీ విజయాల్ని కూడా అందుకున్నారు. తాజాగా మరో సినిమాను బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి రీమేక్ కానుంది. గతేడాది అక్టోబర్ లో హిందీలో విడుదలైన అంధామన్ మూవీ త్వరలోనే తెలుగులో రీమేక్ కానుంది.

బాలీవుడ్ లో అంధాదున్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించారు. ఈమూవీలో టబు కీలకపాత్రలో నటించింది. ఈమూవీలో తెలుగు రీమేక్ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈపోటీలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలుగు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.

సుధాకర్ రెడ్డితో పాటు వయాకామ్ 18 వారు కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉండనున్నారు. ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. నితిన్ ప్రస్తుతం భీష్మ తో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ఈమూవీలో నటించనున్నాడు.

- Advertisement -