రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరో నిఖిల్ నేడు గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా బాగుందన్నారు.
మనం స్టాలిన్ సినిమాలో చూశాం ఒకరు ముగ్గురికి సహాయం చేయాలని అదేవిధంగా ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయాలనే విధంగా సంతోష్ అన్న చేపట్టిన కార్యక్రమం చాలా వినూత్నంగా ఉందని గతంలో కూడా సీడ్ గణేష్ పేరు మీద పర్యావరణ పరిరక్షణ కోసం తన కర్తవ్యాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం సంతోష్ అన్న చేపట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు పోతుందని తెలిపారు. కాబట్టి ఈ ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని అందుకోసం నేను నా నూతన చిత్రం 18 పేజీలు చిత్ర బృందం సభ్యులను అదేవిధంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, అవికా గౌర్, కలర్ స్వాతి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.