పంట రుణాల పథకాన్ని ప్రారంభించిన సీఎం..

37
cm jagan

ఆంధ్రప్రదేశ్ లో రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకం ప్రారంభించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్నదాతలకు ఎంత చేసినా తక్కువేనని.. 14.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.510 కోట్లకు పైగా జమ చేసినట్టు వెల్లడించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నట్టు చెప్పారు.

రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తున్నామని, అక్టోబరులో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేశామని, నెల లోపే రూ.132 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేశామని సీఎం జగన్ వివరించారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీపై రూ.1,180 కోట్ల మేర బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలు కూడా తామే చెల్లించామని చెప్పారు. 18 నెలల వ్యవధిలోనే 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చామని వెల్లడించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.147 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు.