- Advertisement -
కరోనా సృష్టించిన విలయతాండవంతో ప్రపంచ దేశాలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో చైనానే దోషిగా చూపిస్తూ అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై రకరకాల ఊహాగానాలు షికార్ చేస్తుండగానే హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనా చైనాలోనే పుట్టిందని..ఈ వైరస్‌ని ప్రపంచదేశాలకు వదిలింది చైనానే అనే అనుమానం వ్యక్తం చేశాడు నిఖిల్. కరోనా పుట్టిన వుహాన్ నుండి ప్రపంచదేశాలకు విమానాలను నడిపి వైరస్ వ్యాప్తికి కారణమైందని అనుమానాన్ని వ్యక్తం చేశాడు.
నోవెల్ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షా 20 వేల మంది మరణించారు. దాదాపు 20 లక్షల మందికి ఆ వైరస్ సంక్రమించింది. కరోనా ధాటికి అమెరికా,ఇటలీ లాంటి దేశాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అంతా చైనానే దోషిగా చూపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
- Advertisement -