విడాకులపై నిఖిల్ అఫిషియల్!

102
nikhil
- Advertisement -

కరోనా లాక్ డౌన్ సమయంలో హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిఖిల్ నటించిన కార్తీకేయ 2 బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించగా తర్వత వరుస సినిమాలతో జోష్ మీదున్నారు నిఖిల్.

అయితే తాజాగా నిఖిల్‌కు సంబంధించిన ఓ వార్త టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త వైరల్‌గా మారగా దీనిపై అఫిషియల్‌గా స్పందించారు నిఖిల్.

తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..‘‘మనమిద్దరం కలిసున్న ప్రతిక్షణం అద్భుతమే’’ అంటూ కామెంట్ చేశాడు. గోవాలో తన భార్యతో వెకేషన్‌లో ఉన్నట్లుగా ఈ ఫోటోను చూస్తే అర్థమవుతోంది. నిఖిల్‌పై వచ్చిన రూమర్లపై తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు ఫ్యాన్స్‌. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయవద్దని సూచిస్తున్నారు. ఇక నిఖిల్ త్వరలోనే 18 పేజీస్ అనే సినిమాతో అలరించబోతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -