ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ నటించిన `అర్జున్ సురవరం`సినిమా రిలీజ్ రెడీగా ఉంది. అంతేకాదు ఈ యంగ్ హీరో `శ్వాస` అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండింటితో పాటు ప్రస్తుతం చందు మొండేటితో కలిసి `కార్తికేయ-2` కోసం సిద్ధమవుతున్నాడు. ఇదిలా వుంటే హీరో నిఖిల్ ఓ యంగ్ డాక్టర్తో ప్రేమలో వున్నానని వెల్లడించి అందరికీ షాకిచ్చాడు.
మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ షోలో ఈ యంగ్ హీరో ఆమె వివరాలను వెల్లడించాడు. తన జీవితంలో ఒక అమ్మాయి చాలా స్పెషల్ అని, ఆమె ఒక డాక్టర్ అంటూ తన ప్రేమ విశేషాలను సినీ హీరో నిఖిల్ పంచుకున్నాడు. తనను ఆమె బాగా అర్థం చేసుకుంటుందని చెప్పాడు.
అంతేకాదు నా సినిమాల విషయంలో కానీ.. పర్సనల్ విషయాల్లో గానీ.. తాను డిస్టర్బ్ చేయదని… నువ్వు ఎప్పుడు సరదాగా గడపాలనుకుంటే అప్పుడు గడుపు అని చెబుతుందని నిఖిల్ తెలిపాడు. ఏరోజూ తన ఫోన్ కూడా చెక్ చేయదని చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందనే ఆలోచన ఆమెదని తెలిపాడు. తనకు ప్రేమపెళ్లిపై ఇష్టం పెరగడానికి షారుఖ్ ఖాన్ సినిమాలే కారణమని చెప్పాడు.