బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ..!

549
ganguly
- Advertisement -

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నియమితులు కానున్నారని సమాచారం. బీసీసీఐ సభ్యత్వం ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాలు ముంబైలో సమావేశమై.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గంగూలీకి బీసీసీఐ మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్ బృందం నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ వ్యూహాత్మకంగా అందరి మద్దతు కూడగట్టిన గంగూలీ.. అధ్యక్ష పదవి రేసులో ముందు నిలిచాడు.

బోర్డులో లోధా కమిటీ సిఫార్సుల అమలు, క్రికెట్ పాలకుల కమిటీ అతి జోక్యంతో గాడి తప్పిన బీసీసీఐ పాలనని గంగూలీ అయితేనే మళ్లీ గాడిన పెట్టగలడని రాష్ట్ర క్రికెట్ సంఘాలు పక్కా వ్యూహంతో మద్దతిచ్చాయి. దీంతో శ్రీనివాసన్ అనుచరుడు బీసీసీఐ పీఠంపై ఆశలు పెంచుకున్న బీజేష్ పటేల్‌కు షాక్ తగిలింది.

ఇక బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా,కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ బోర్డు కోశాధికారిగా ఎంపిక కానున్నారు. పోటీ లేకుండా బీసీసీఐ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -