మరోసారి పెళ్లి వాయిదా…. నిఖిల్ కామెంట్స్..!

372
nikhil
- Advertisement -

కరోనాతో ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాది పెళ్లిళ్లు వాయిదా పడగా హీరో నిఖిల్ పెళ్లికి కూడా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కామెంట్స్ చేశారు నిఖిల్. కరోనాతో పోరాటం ముగిసే వరకు మా పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ప‌ల్ల‌వి,తాను మంచి రోజుల కోసం ఎదురు చూస్తూన్నామని చెప్పారు నిఖిల్. ప్ర‌జ‌ల బాధ‌ల‌తో పోలిస్తే మా బాధేమి పెద్ద‌ది కాదని…తన పెళ్లికి వచ్చిన వారిలో ఎవరికైనా కరోనాసోకితే ఆ బాధ జీవితాంతం ఉంటుందని చెప్పారు. పెళ్లి అనేది మ‌ర‌పురానిగా ఉండాల‌నే ఈ కష్టకాలంలో పెళ్లి చేసుకోకూడదనుకుంటున్నానని చెప్పారు.

ఫిబ్రవరి 3న భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తొలుత ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, లాక్ డౌన్‌తో మే 14కి వాయిదా పడింది. తాజాగా కరోనా కంట్రోల్‌లోకివచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్పష్టంచేశారు నిఖిల్.

- Advertisement -