మారేడుమిల్లి అడ‌వుల్లో నిఖిల్!

14
- Advertisement -

హీరో నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్ వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ ‘స్వయంభూ’లో తన మ్యాజిక్‌ చూపించనున్నారు.మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఈ టాప్ టెక్నిషియన్ ఇప్పటికే టీంలో చేరారు. మ్యాసీవ్ సెట్స్ తో గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోందని మేకింగ్ వీడియో చూస్తే అర్ధమౌతోంది. నిఖిల్‌కి ఇప్పటి వరకు మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా ఇదే.

సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పీరియాడికల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప‌లు కీల‌క స‌న్నివేశాల‌తో పాటు యాక్ష‌న్ సీన్స్ ను మారేడుమిల్లి అడ‌వుల్లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ షూటింగ్ లో నిఖిల్ తో పాటు ప‌లువురు కీల‌క న‌టీన‌టులు పాల్గొంటున్నారు.

Also Read:ఆషాడ బోనాలకు నిధులు విడుదల..

- Advertisement -