ప్చ్.. నవదీప్ గోరు ఇది తెలుసుకోండి

60
- Advertisement -

అయ్యా హీరో నవదీప్ గారు తమరు హీరో అయితే కావొచ్చు.. అంతమాత్రాన చట్టాలకు వ్యతిరేకంగా వెళ్తూ.. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎలా అండి ?, డ్రగ్స్ తీసుకోవడం అనేది ఇండియాలో నేరం అనే విషయం తెలిసి.. ఎందుకు మత్తు పదార్థాల జోలికి వెళ్లారు ?, సరే మీరు వెళ్లారో లేదో మీకూ, ఆ దేవుడికే తెలియాలి. పోనీ మీ మాట ప్రకారమే ముందుకు పోదాం. మీరూ ఏ తప్పు చేయలేదని అనుకుందాం. మరి అలాంటప్పుడు పోలీసులకు దొరకకుండా ఎందుకు పారిపోతున్నారు ?,

హీరో నవదీప్ డ్రగ్స్ కేసులో కోర్టు దూకుడు పెంచింది అంటూ టీవీలు మోత మోగిస్తున్నాయి కదా. మరోవైపు మీకు 41 A కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది కదా. ఇంకా ఎందుకు అనవసరమైన ప్రయాస. అసలు పోలీసుల విచారణకు నవదీప్ హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటేనే.. మీరు మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోవడం అటు ఉంచి.. నార్కోటిక్ పోలీసులను మిస్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీకే నష్టం అనే విషయాన్ని మీకు అర్థం అయ్యేలా చెప్పేది ఎవరు ?,

మొత్తం ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని మీకు నార్కోటిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నవదీప్ సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. సహకరించకపోతే అరెస్ట్ అవుతాం అనే విషయం మీరు ఇప్పుడైనా తెలుకోవాలి. తప్పు చేయకపోతే.. మిమ్మలిని నార్కోటిక్ పోలీసులు ఏమీ చేయరు. ఒకవేళ మీ పై వారు యాక్షన్ తీసుకునే పరిస్థితే వచ్చినా మీరు బాధ పడక్కర్లేదు. సినీ పరిశ్రమలోని ఎందరికో మీరు ఉదాహరణగా ఉంటారు. తప్పు చేస్తే చట్టం వదిలి పెట్టదు అని అందరికీ అర్థం అవుతుంది.

Also Read:బీజేపీలో అమిత్ షా రేపిన మంట!

- Advertisement -