డ్రగ్స్ కేసు పై స్పందించిన హీరో

22
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు టాలీవుడ్ ఇండస్ట్రీని చుట్టేసింది. ఓ నిర్మాత, హీరో ఇందులో ఉన్నారని ఇప్పటికే వార్తలు రావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. మరోవైపు మాదాపూర్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ హీరో నవదీప్‌కు సంబంధం ఉన్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇప్పటికే తెలిపారు. నవదీప్‌తో పాటు మరికొందరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హీరో నవదీప్ స్పందించాడు.

తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని తెలిపాడు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ పేర్కొన్నాడు. అలాగే తనకు నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేయడం పై కూడా నవదీప్‌ మాట్లాడుతూ.. తన పై ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని.. బహుశా అందుకే నార్కోటిక్ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసి ఉంటారని నవదీప్ చెప్పుకొచ్చాడు. మరి చివరకు ఈ డ్రగ్స్ కేసు ఏమవుతుందో చూడాలి. కాగా, ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి కూడా పరారీలోనే ఉన్నారు. అతని కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అలాగే ‘బేబీ’ సినిమాపై కూడా హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా, ఏ విధంగా ఉపయోగించాలనే విధంగా సీన్లు ఉన్నాయని మండిపడ్డారు. అలాంటి దృశ్యాలను చిత్రీకరించొద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు.

Also Read:షారుఖ్ ఖాన్..బన్నీని కలుస్తాడట

- Advertisement -