భారీగా పెరగనున్న టూ-వీలర్ ధరలు!

314
hero
- Advertisement -

టూ విలర్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది హీరో మోటోకార్ఫ్ లిమిటెడ్. గత కొద్దిరోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతుండటంతో పాటు గత అక్టోబర్ నుంచి ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బైక్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గడంతో సేల్స్ పడిపోయాయి. దీంతో పాటు తయారీకి సంబంధించిన వస్తువుల ఖర్చులు కూడా భారీగా పెరగడంతో టూ వీలర్ ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఆ కంపెనీ.

ఏప్రిల్ 1, 2021 నుంచి ఒక్కో టూ-వీలర్‌పై రూ.2,500 పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఈ కంపెనీ షేర్లు 0.83 శాతం పతనం కావడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్టీల్, కాపర్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని హీరో ప్రకటించింది. పెంచిన ధర అన్ని మోడల్ బైక్స్‌కు ఒకే విధంగా ఉండదని, వినియోగదారుడు ఎంచుకునే మోడల్‌ను బట్టి పెంచిన ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయని హీరో సంస్థ ప్రకటించింది.
హీరో స్కూటీలపై కూడా ఈ పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి.

- Advertisement -