కనకదుర్గమ్మ సన్నిధిలో సత్యం సుందరం టీం

10
- Advertisement -

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన చిత్రం ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది.

పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకోగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు హీరో కార్తీ, సత్యం సుందరం మూవీ టీమ్. విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం అని కార్తీ తెలిపారు. 2013 తర్వాత మళ్లీ అమ్మవారి దర్శనం చేసుకున్నాను అని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు కార్తీ.

ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన సత్యం సుందరం విశేషంగా ఆకట్టుకుంటోంది. కార్తీ, అరవింద్ స్వామి క్యారెక్టర్స్ మధ్య ఒక నైట్ లో జరిగే కథ. వాళ్ళ మధ్య అనుబంధం ఏమిటి? ఆ ఒక్క నైట్ లో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగిందనేది హోల్ స్టొరీ.

Also Read:పిల్లల్లో మధుమేహం..ఇలా పసిగట్టవచ్చు!

- Advertisement -