ట్రాక్‌లోకి రజనీ..ఈసారి అల్లుడు దర్శకత్వంలో!

245
rajini
- Advertisement -

హెల్త్ చెకప్‌ కోసం అమెరికా వెళ్లిన రజనీ స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. స్వదేశానికి తిరిగివచ్చిన తలైవా….తిరిగి సినిమాలను లైన్లో పెట్టేశారు. ప్రస్తుతం తన 168వ సినిమా అన్నాత్తే…తన కూతురు దర్శకత్వంలో చేయనుండగా ఈ సినిమా సెట్స్‌పైకి ఉండగానే మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశారు. ఇందులో ఒక సినిమాకు తన అల్లుడు,హీరో ధనుష్ దర్శకత్వం వహించనున్నారు.

169వ సినిమాకు పెరియసామి దర్శకత్వం వహించనుండగా ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక 170వ చిత్రానికి ఆయన అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించబోతున్నారట. ఇకఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ధనుష్ “పవర్ పాండి” చిత్రానికి దర్శకత్వం వహించగా రజనీతో తీయబోయే సినిమాకు ఐశ్వర్య, సౌందర్య నిర్మించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -