జక్కన్న రికార్డును బ్రేక్ చేసిన అజిత్..!

41
ajith

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ బాహుబలి. తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ మూవీ …భారతీయ సినిమా రికార్డులను సైతం తిరగరాసింది. బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అనేలా సిని ఇండస్ట్రీ మారిపోయింది. ఇక బాహుబలి రికార్డులను చెరిపేయడం సాధ్యం కాదనుకున్న తరుణంలో తలా అజిత్…ఆ రికార్డులను చెరిపేశారు.

అజిత్ తాజాగా నటిస్తున్న “వాలిమై” ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఈగర్‌గా వేయిట్ చేస్తుండగా ఈ నేపథ్యంలో ఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ వాలిమై సినిమాపై ఎంతమందికి ఇంటరెస్ట్ ఉందో తెలపాలంటూ సర్వే నిర్వహించింది. అందులో అజిత్ ‘వాలిమై’… బాహుబలి 2, ఎవెంజర్స్: ఎండ్ గేమ్ రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది.

బుక్‌మైషోలో 1.73 మిలియన్లకు పైగా ఇంటరెస్ట్ లను సంపాదించింది. ఈ సంఖ్య ఎవెంజర్స్: ఎండ్ గేమ్, బాహుబలి 2 సంపాదించిన ఇంటరెస్ట్ ల కన్నా ఎక్కువ కావడం విశేషం. ఇప్పుడే ట్రెండ్ సెట్ చేస్తున్న అజిత్ అభిమానులు ఇక వాలిమై ఫస్ట్ లుక్ ఎన్ని సెన్సేషన్‌లు క్రియేట్ చేస్తుందో వేచిచూడాలి.