కోలీవుడ్ హీరో ఆర్య, హీరోయిన్ సయేషా సైగల్‌ల వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. వీరి పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శుక్రవారం నుంచి వీరి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకి బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ దత్, ఖుషీ కపూర్, ఆదిత్యా పంచోలి హాజరయ్యారు. ఇక శనివారం జరిగిన సంగీత్ వేడుకలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. హైద్రాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలస్‌లో రెండు రోజులపాటు వీరి వివాహ వేడుక జరిగింది.
ఈ మద్యే ఆర్య, సయేషా సైగల్ పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లితో ఏడడుగులు వేశారు. గతేడాది భలేభలే మగాడివోయ్ రీమేక్ గజినీకాంత్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా వాళ్లిద్దరి జోడీ మాత్రం సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఆర్య, సయేషా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
Forever and Ever😍😍🤗🤗😘 @sayyeshaa pic.twitter.com/gtLu8ilP2c
— Arya (@arya_offl) March 10, 2019