ఎంపీలను గెలిపించే బాధ్యత..ఎమ్మెల్యేలదే:సీఎం కేసీఆర్

259
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడంపై మాక్‌ పోలింగ్‌ను నిర్వహించారు. ఏ ఎమ్మెల్సీకి ఎవరు ఓటేయాలనే దానిపై దిశానిర్దేశం చేశారు సీఎం. రేపు మరోసారి టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. అనంతరం తెలంగాణ భవన్ నుండి ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి వెళ్లనున్నారు ఎమ్మెల్యేలు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ తెలంగాణలో17 ఎంపీ స్ధానాలను క్లీన్ స్వీప్ చేయాలన్నారు. ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని తెలిపిన సీఎం రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఇక ఈ నెల 17న కరీంనగర్‌లో, 19న నిజామాబాద్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు.

ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరుగుతుండగా టీఆర్ఎస్ నుండి మహమూద్ అలీ, షేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేషం ,మిత్రపక్షం ఎంఐఎం నుండి మీర్జా రియాజ్ ఉల్ బరిలో నిలవగా కాంగ్రెస్‌ నుండి గుడూరు నారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాము ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌,ఎంఐఎం ఐదు స్ధానాల్లో గెలవడం లాంచనమే కానుంది.

- Advertisement -