‘అతిథి దేవోభవ’ యాక్ష‌న్ హైలైట్‌- హీరో ఆది

129
- Advertisement -

ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. పొలిమేర నాగేశ్వర్ ద‌ర్శ‌కుడు. రాం సత్యనారాయణ రెడ్డి సమర్ఫణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌లై ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకు చిత్ర యూనిట్ ఆదివారంనాడు ప్ర‌సాద్‌ల్యాబ్‌లో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది.

ఈ సంద‌ర్భంగా ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, సినిమా విడుద‌లైన మొద‌టి షో నుంచి బాగుంద‌ని చాలా ఫోన్లు వ‌చ్చాయి. ప్రేక్ష‌కులు మంచి సినిమాను ఎప్ప‌డు ఆద‌రిస్తారు. క‌లెక్ష‌న్లు కూడా బాగున్నాయంటున్నారు. వైజాగ్ ,సీడెడ్ ల‌లో క‌లెక్ష‌న్లు చాలా బాగున్నాయ‌ని రిపోర్ట్ వ‌చ్చింది. ఇక నా పెర్ ఫార్మెన్స్‌కూ హీరోయిన్ న‌ట‌న‌కు అప్లాజ్ వ‌స్తోంది. పాట‌లు కూడా మంచి ఆద‌ర‌ణ పొందాయి. నా త‌ల్లిగా న‌టించిన రోహిణికీ, నా మ‌ధ్య వున్న స‌న్నివేశాలు హార్ట్ ట‌చింగ్ వున్నాయ‌ని తెలియ‌జేస్తున్నారు. ఇక సప్త‌గిరి కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో మ‌రో స్థాయిలో వుంది. ఎక్క‌డా వినోదం మిస్ కాకుండా ద‌ర్శ‌కుడు తీశాడు. యాక్ష‌న్ ఎపిసోడ్ హైలైట్‌గా వుంద‌ని టాక్ వ‌స్తోంది. బ‌య‌ట కోవిడ్ వంటి వాతావ‌ర‌ణ వున్నా ఇంత ఆద‌ర‌ణ పొంద‌డం ఆనందంగా వుంది. త‌ప్ప‌కుండా ఇంకా చూడ‌నివారుంటే చూసి ఆనందించండి అని తెలిపారు.

చిత్ర ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్ తెలుపుతూ, తెలుగు ప్రేక్ష‌కులు మా సినిమాను ఇంత‌లా ఆద‌రిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాం. అన్ని ఏరియాల‌నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. వైజాగ్‌, సీడె్డ్‌ల‌లో హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌లో ర‌న్ అవుతోంది. మిగిలీఇన చోట్ల బాగుంద‌నే టాక్ వుంది. సినిమా ఫ‌స్టాఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో వుంటూ సెకండాఫ్ మంచి ఎమోష‌న్స్ పండాయ‌ని ప్రేక్ష‌కులు తీర్పు ఇచ్చారు. ఇక స‌ప్త‌గిరి పాత్ర హైలైట్‌గా నిలిచింది. హీరో హీరోయిన్ల‌తోపాటు రోహిణిగారి పాత్ర సాంకేతిక సిబ్బంది పనిత‌నం అంద‌రూ మెచ్చుకుంటున్నార‌ని తెలిపారు. నిర్మాత‌లు మాట్లాడుతూ, బ‌య‌ట కోవిడ్ ప‌రిస్థితులు వ‌ల్ల బాగోలేక‌పోయినా మా తొలి ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తున్నందుకు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

- Advertisement -