లేటు వయసులో లంకకు కెప్టెన్‌ అయ్యాడు…

225
- Advertisement -

టెస్టుల్లో అరంగేట్రం చేసిన 17 ఏళ్ల తర్వాత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం అతడికి దక్కింది. సుడులు తిరిగే బంతులతో, తన జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ సీనియర్ క్రికెటర్ కు 38 ఏళ్ల వయసులో కెప్టెన్సీ భాద్యతలు నిర్వహించే ఛాన్స్ లభించింది. అతను ఎవరో కాదు, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్. ఇటీవల ఆసీస్‌తో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హెరాత్‌…శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

జింబాబ్వే జరగనున్న రెండు టెస్టుల సిరీస్ లో జట్టుకు అతడు నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం, వైస్ కెప్టెన్ దినేశ్ చందిమాల్ కూడా అందుబాటులో లేకపోవడంతో హెరాత్ కు అవకాశం వచ్చింది. సోమచంద్ర డిసిల్వా తర్వాత టెస్టు జట్టుకు నాయకుడిగా ఎంపికైన బౌలర్ హెరాత్ ఒక్కడే. 1999లో టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన అతడు ఇప్పటివరకు 73 టెస్టులు, 71 వన్డేలు, 17 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 332 వికెట్లు పడగొట్టాడు.

Rangana-Herath

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ వ్యక్తిగతంగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. 12.75 బౌలింగ్ సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. మూడు టెస్టుల సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ గా రికార్డు కెక్కాడు. మూడో ప్రపంచ బౌలర్ గా నిలిచాడు. హెడ్లీ(న్యూజిలాండ్) 33, హర్భజన్ సింగ్(భారత్) 32 అతడి కంటే ముందున్నారు. ముత్తయ్య మురళీధరన్ కూడా 28 వికెట్లు పడగొట్టాడు. ఇందుకు ముళీధరన్ 1255 బంతులు తీసుకోగా, హిరాత్ 870 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు.

herath

ఆస్ట్రేలియాతో పల్లెకెలెలో జరిగిన మొదటి టెస్టులో 9, గాలెలో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టాడు. చివరి మ్యాచ్ లో సంచలనాత్మక బౌలింగ్ తో 13 వికెట్లు నేలకూల్చాడు. 2014లో పాకిస్థాన్ జరిగిన రెండు టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

- Advertisement -