81 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: హేమంత్ సోరెన్

7
- Advertisement -

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు సీఎం హేమంత్ సోరెన్. జేఎఎం నేతృత్వంలోని కూట‌మి అన్ని స్థానాల్లో పోటీ చేయ‌నుందని వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ కూట‌మి విజ‌యం సాధించ‌నున్న‌ట్లు సోరెన్ విశ్వాసం వ్య‌క్తం చేశారు.

తాము బీజేపీ త‌ర‌హా కాదు అని, ప్ర‌క‌టించిన అన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తామ‌ని హేమంత్ సోరెన్ తెలిపారు. 2019లో డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా.. త‌మ కూట‌మే విజ‌యం సాధించిన‌ట్లు సోరెన్ దంప‌తులు వెల్ల‌డించారు.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 5వ తేదీన జార్ఖండ్ అసెంబ్లీ కాల‌ప‌రిమితి ముగియ‌నున్న‌ది. ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను ఈసీ ప్ర‌క‌టించ‌నుంది.

Also Read:చైతన్య దీప్తి – అబ్దుల్ కలాం

- Advertisement -