జార్ఖండ్ సీఎంగా ప్రమాణంచేసిన హేమంత్ సోరెన్

408
hemanthsoren
- Advertisement -

జార్ఖండ్ ముఖ్యమంత్రి జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్ 11ముఖ్యమంత్రిగా గవర్నర్ ద్రౌపతి ముర్ము హేమంత్ సోరెన్ త ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాగల్, డీఎంకే నేత స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ తదితరులు హాజరయ్యారు.

మరోవైపు JMMకి సీఎం పదవి దక్కనుండటంతో కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి దక్కే ఛాన్స్‌ ఉంది. మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఏ మంత్రి పదవి దక్కనుందన్న చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. జార్ఖండ్ లో ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 81 స్థానాలకు గాను సంకీర్ణానికి 47 సీట్లు దక్కగా, బీజేపీ ప్రభుత్వానికి 25సీట్లు వచ్చాయి. మెజార్టీ సీట్లు కూటమికి రావడంతో జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

- Advertisement -