ఆ దర్శకుడిపై హేమామాలిని సంచలన కామెంట్స్!

39
- Advertisement -

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమామాలిని ఓ దర్శకుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1960లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన హేమామాలిని తన కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. స్టార్ హీరోలతో నటించి మెప్పించారు. ఇక 2014,2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మథుర నియోజకవర్గం నుండి బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందారు.

ఇక తాజాగా ఓ దర్శకుడిపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఓ డైరెక్టర్ తన చీరకు ఉన్న పిన్ తీయాలని కోరాడు. అప్పుడు నేను నిజంగా షాక్‌కు గురయ్యాను. డైరెక్టర్ ఏదో ఒక బోల్డ్ సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకున్నాడు. ఐతే, నేను ఎప్పుడూ నా చీరపై పిన్‌ను పెట్టుకుంటాను. నన్ను చీరకు ఉన్న పిన్ తీసేయమని ఆ దర్శకుడు అడిగాడు. కానీ, నేను మాత్రం చీర కింద పడిపోతుంది అన్నాను.

Also Read:పౌష్టికాహార లోపమా..!

మాకు అదే కావాలి అన్నాడు ఆ దర్శకుడు అని హేమమాలిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. అయినప్పటికీ ఆ దర్శకుడు కోరిన విధంగా నేను ఆ చిత్రంలో నటించాను అని తెలిపారు. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం వెల్లడించలేదు.

Also Read:సాయిచంద్‌కు సీఎం కేసీఆర్ నివాళి..

- Advertisement -