యాక్షన్‌తో అదరగొట్టిన అఖిల్…

242
HELLO! Movie Teaser
- Advertisement -

అఖిల్‌ అక్కినేని ‘హలో..’ అంటూ వచ్చేశాడు.. అఖిల్ హీరోగా నటిస్తున్న హలో సినిమా టీజర్‌ను గురువారం (నవంబర్ 16) విడుదల చేశారు. నాగార్జున వాయిస్‌ ఈ టీజర్‌కు మరో ఆకర్షణగా నిలిచింది. ఒక్కసారి చిన్నతనంలో కలసిన మనసులు విడిపోవని.. అవి ఎప్పటికైనా తమ సోల్ మేట్ ను వెతుక్కుంటాయంటూ.. నాగార్జున వాయిస్ ఓవర్ తో కూడుకున్న అఖిల్ టీజర్.. యాక్షన్ సీక్వెన్సులతో అదిరిపోయింది.

ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ ఇన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా.. ఏం అడ్డు వచ్చినా.. తన సోల్‌ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్‌ చేసుకుంటారు అనే వాయిస్‌ ఓవర్‌తో టీజ‌ర్‌ ప్రారంభమైంది. ‘మనం’ ఫేమ్ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరోసారి యాక్షన్‌ సన్నివేశాలకు పెద్దపీట వేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది..

- Advertisement -