టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. హీరో హీరోయిన్లపై ఒక రొమాంటిక్ సీన్‌ను టీజర్‌గా కట్ చేశారు.
అక్కినేని నాగార్జున నటించిన ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురూ ప్రేమకోసమేరో ఈ జీవితం..’ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఇప్పుడు రామ్ నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇంతకుముందు కంటే రామ్ ఈ సినిమాలో మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా మరింత గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రణీత .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.